HHVM : విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. పిరియాడిక్ అడ్వెంచర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అనుకున్న సమయానికే దీనిని విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇటీవలే సినిమా మే 9న విడుదలవుతుందని మేకర్స్ చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందంటూ కొన్ని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో సినిమా ఆలస్యమవుతుందంటూ మరింత రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు (శుక్రవారం) చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలోనిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో తొలి భాగం విడుదల కానుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఫ్రేమ్‌, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ మెప్పించనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా ఆకట్టుకోనున్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : ఇవాళ ఓటీటీలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలివే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *