ముఖేష్ కుమార్ స్వింగ్ తో మాయచేశాడు. ఢిల్లీ విజయం

లక్నో వేదికగా జరిగిన ఐపిఎల్ 40 వ మ్యాచ్ ఎల్ ఎస్ జి మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్ 33 బంతుల్లో 52 పరుగులు ( 2 ఫోర్లు 3 సిక్సర్లు) కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 45 పరుగులు ( 3 ఫోర్లు 1 సిక్సర్) చేశాడు. వీరిద్దరూ చక్కని ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడారు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవరు నిలకడగా ఆడలేదు. ఆయుష్ బ దాని ఒక్కడే 21 బంతుల్లో 36 పరుగులు చేసి ( 6 ఫోర్స్) పరవాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ 4 వికెట్స్ తీసి ఎల్ ఎస్ జీ జట్టు నడ్డి విరిచాడు. తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ అభిషేక్ పోరల్ 36 బంతుల్లో 51 పరుగులు ( 5 ఫోర్లు , 1 సిక్స్) బాదాడు. మూడో నంబర్ బ్యాట్స్మన్ కే ఎల్ రాహుల్ 42 బంతుల్లో 57 పరుగులు ( 3 ఫోర్లు 3 సిక్సర్లు) , కెప్టెన్ అక్సర్ పటేల్ 20 బంతుల్లో 34 పరుగులు ( 1 ఫోర్, 4 సిక్సర్లు) చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ 139 మ్యాచెస్ లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 4 వికెట్స్ తీసుకున్న ముఖేష్ ను మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

శివ మల్లాల

Also Read This : ఆకాశంపై ఉమ్మి వేస్తే ఎక్కడ పడుతుంది… తప్పెవరిది

SINGER PRAVASTHI
SINGER PRAVASTHI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *