...

ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో చిత్రం ప్రారంభం

హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే చిత్రంగా రూపొందుతోంది. ఆది పినిశెట్టి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది. ఈ చిత్రం ప్రేమ, త్యాగం,కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించనున్నాయి. ఈ సినిమా లవ్ స్టోరీ మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల ఆధారంగా రూపొందనుంది.

ఈ సినిమా ప్రారంభం సందర్భంగా దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. టీఎస్ఆర్ తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు ఆదినారాయణ తెలిపారు. ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చిందని.. కొత్త జోనర్ లో వైవిధ్యమైన లొకేషన్‌లలో ఈ సినిమాని తెరకెక్కించి ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతి ఇస్తామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.