LEO Review : సినిమా – లియో – LEO
రేటింగ్ – 2.5/5
నటీనటులు – దళపతి విజయ్, త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్తు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ముస్కిన్, అలీ ఖాన్, సూర్య, ప్రియా ఆనంద్, అర్జున్ దాస్, నవీన్ పౌలీ తదితరులు.
సంగీతం – అనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ – మనోజ్ పరమహంశ
ఎడిటర్ – పి రాజ్
నిర్మాత – లలిత్ కుమార్
బ్యానర్ – సెవెన్ స్క్రిన్ స్టూడియో
దర్శకత్వం – లోకేష్ కనగరాజ్
విడుదల – 19 అక్టోబర్ 2023
తమిళనాట ఇళయదళపతి గా పేరు గాంచిన విజయ్, అలానే తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ హిట్టు సినిమాల దర్శకుడిగా మారిన లోకేష్
కనగరాజ్ డైరెక్టర్ గా తెరకెక్కిక సినిమా లియో. ఈ సినిమాకు సంగీతం అనిరుద్ రవిచంద్రన్. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులకి
బాగా నచ్చడంతో సినిమా రిలీజ్ టైం కి సినిమా మీద అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ
సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
కథ విషయానికి వస్తే బేసిక్ గా గ్యాంగ్ స్టర్ అయిన లియో కి అండ్ హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నడుపుకుంటున్న ప్రతిబిన్ కి మధ్య ఉన్న పోలిక,
ప్రతిబిన్ ని ఎలా ఇబ్బంది పెట్టుద్ది, అసలు లియో ఎవరు ? అనేది కథ. చాలా సింపుల్ కథ, కానీ సినిమాను దర్శకుడు మలిచిన విధానమే ఇలాంటి
కథలకు ఆయువు పట్టు.
సినిమా విషయానికి వస్తే, ఇదొక యాక్షన్ గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. విజయ్ వన్ మ్యాన్ షో. త్రిష
నటన చాలా బాగుంది. సంజయ్ దత్తు కూడా లియో ఫాదర్ గా చక్కగా నటించారు. అర్జున్ సర్జా నటన విక్రమ్ లో రోలెక్స ని గుర్తు చేస్తుంది.
సినిమాకు హైలెట్ ఏంటి అంటే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే.
తన స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ తో ప్రేక్షకులను వావ్ అనేలా చేసే దర్శకుడు లోకేష్ ఈ సినిమాతో అంత సంతృప్తి పరచలేకపోయాడు.
ప్రేక్షకులకి చెప్పడానికి కథ ఏమి లేదు కాబట్టి, సబ్ ప్లాట్ లతో స్క్రిన్ ప్లే మ్యాజిక్ చేద్దాం అనుకోని ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు.
యాక్షన్ విషయానికి వస్తే కాఫీ షాప్ ఫైట్ అండ్ మార్కెట్ ఫైట్ మాత్రం యాక్షన్ లవర్స్ ని బాగా ఎంజాయ్ చేసేలా చేస్తాయి.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం భరించాలి తప్పదు.
టెక్నీకల్ సపోర్ట్ కి వస్తే, అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రతి ఫ్రెమ్ లో ప్రాణం పోసింది, మనోజ్ పరమహంశ కెమెరా వర్క్ చాలా బాగుంది, కథ లేని సినిమాలో ఎదో చెప్పాలనే లోకేష్ ప్రయత్నాన్ని కొంత నమ్మింది కెమెరా మ్యాన్ ఏ అని అర్ధం చేసుకోవచ్చు. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి.
నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, సినిమా యాక్షన్ లవర్స్ కి తప్ప మారె ఇతర ప్రేక్షకులను అంతగా అలరించకపోవచ్చు. సెకండ్ హాఫ్ బలవంతంగా చుస్తున్నామా అనే ఫైలింగ్ వస్తుంది.
ఒక్క మాటలో – నాట్ ఆ పార్ట్ ఆఫ్ ఎల్ సి యు
రేటింగ్ – 2.5/5
Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు