మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూపిస్తామంటూ వచ్చారు ‘కౌసల్య తనయ రాఘవ’ టీం. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అడపా రత్నాకర్ నిర్మించారు. ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను ఓపెన్ చేసిన తీరు.. కథను చెప్పిన తీరు.. పాత్రల్ని పరిచయం చేసిన విధానం బాగుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే… ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ప్రేమకథకు చదువు కూడా ముఖ్యమనే సందేశాన్ని జోడించినట్టుగా అర్థమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ లాంచ్ అనంతరం హీరో రాజేష్ మాట్లాడుతూ .. ‘కౌసల్య తనయ రాఘవ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అన్నారు. దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ .. ‘నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించగా నటీనటులంతా అద్భుతంగా నటించారు’ అని అన్నారు. నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ .. ‘రాజేష్, శ్రావణి చక్కగా నటించారు. సినిమా తప్పక విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
నటుడు ఆర్కే నాయుడు మాట్లాడుతూ .. ‘ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇందులో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఆ కారెక్టర్ అందరికీ నచ్చుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. నటి మనీషా మాట్లాడుతూ .. ‘కౌసల్య తనయ రాఘవ’ చిత్రంలో పారిజాతం పాత్ర నాకు చాలా స్పెషల్. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని తెలిపింది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది: ఎన్టీఆర్