Komati Reddy :
మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటూ సొంత పార్టీకే వ్యతిరేకంగా మాట్లడారు.
సోమాజికగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ.. . ఏపీలో పార్టీ నష్టపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని తెలిపారు.
ఇంకా ఆ రాష్ట్రంలో సీట్లు గెలుచుకునే స్థాయిలో పార్టీ బలోపేతం కాలేదన్నారు. ఇక బీజేపీపై, ప్రధాని మోదీపై వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి, బీజేపీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు.
రెండు సార్లు బ్లాక్ మనీ తెస్తామని ఎన్నికల్లో గెలిచిన మోదీ.. ఈసారి రాముని జపం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ పదేళ్ల పాలనలో అదానీ, అంబానీ చేతుల్లో దేశ సంపద ఉంది.
జీఎస్టీ రూపంలో భారీ మోసం జరుగుతుందని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటుంది.
మరోసారి మోదీ ప్రధాని అయితే ఇక ఎన్నికలు జరగకుండా శాశ్వత ప్రధానమంత్రిగా ప్రకటించుకుంటాడంటూ తెలిపారు.
బీజేపీ పని అయిపోయిందన్న వెంకటరెడ్డి
‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నిరోజులైంది? మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం మాపై రాజకీయ విమర్శలు మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త టెండర్ పిలవలేదు.
జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ మోదీకి కనపడడం లేదా? మాది ఆర్ఆర్ కాదు.. మీదే డబుల్ ఏ ప్రభుత్వం.
పదేళ్లలో డబుల్ ఎ అదానీ, అంబానీ బాగుపడ్డారు’’ అని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాదిన బీజేపీపై వ్యతిరేకత ఉందని, అందుకే దక్షిణాదిలో సీట్లకోసం మోదీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ అబద్దాలు రామాయణం కంటే పెద్దగా ఉంటాయని, డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణకు మరో పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని అన్నారు.
బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారని తెలిపారు.
డీ లిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 సీట్లు అవుతాయని, వాటిలో 125 సీట్లను కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పారు. కవితను చూస్తే తనకు జాలేస్తోందని కోమటిరెడ్డి అన్నారు.
కవితమ్మ బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని.. కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేదని ఎద్దేవా చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందని, తలసాని మంత్రి ఎలా అయ్యాడోనని వ్యాఖ్యానించారు.
Also Read This Article : ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించిన భార్య