కలకత్తాలో ఐపీఎల్ 2025 18 వ సీజన్ 53 వ మ్యాచ్ కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఈ మ్యాచ్ నడిచింది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 5 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రే రస్సెల్ (25 బంతుల్లో 57 (4 ఫోర్స్, 6 సిక్సర్లతో) విజృంభించి ఆడటంతో రాజస్థాన్ స్కోర్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ 25 బంతుల్లో 4 ఫోర్స్ సిక్సర్ సాయంతో 35 పరుగులు, అజింక్యా రహానే 24 బంతుల్లో ఒక ఫోర్ 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు, రఘువంశీ 31 బంతుల్లో 5 ఫోర్స్ సాయంతో 44 పరుగులు చివర్లో బ్యాటింగ్ కి దిగిన రింకూ సింగ్ 6 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు వేగంగా చేయటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ స్టార్ కిడ్ వైభవ్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు.
అప్పటి నుంచి రాజస్థాన్ కష్టాలు మొదలయ్యాయి. కునాల్ సింగ్ రాథోర్, ధ్రువ్ జురెల్, వహిందు హసరంగ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ పరుగులేమీ చేయకుండానే డక్ అవుట్ అయి వెనుదిరిగారు. 11 బంతుల్లో 8 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ను జైస్వాల్ , రియాన్ పరాగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. మరో 31 బంతుల్లో 58 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. అప్పటికి ఆర్ ఆర్ స్కోర్ 66 పరుగులకు 3 వికెట్లు. మరో 5 పరుగులు జోడించి మరో రెండు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. అప్పటికి రాజస్థాన్ స్కోర్ 71 పరుగులకు 5 వికెట్లు. అక్కడ నుంచి రియాన్ పరాగ్ 45 బంతుల్లో 6 ఫోర్స్ 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి తన బ్యాటింగ్ జైత్ర యాత్ర కొనసాగించాడు.
రాజస్థాన్ జట్టు దాదాపు గెలుస్తుంది అనే పరిస్థితికి టీమ్ వచ్చిన తర్వాత లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు పరాగ్. 173 పరుగుల వద్ద రియాన్ పరాగ్ అవుటయ్యారు. చివరి ఓవర్ కు 22 పరుగులు అవసరమైన సమయంలో కలకత్తా బౌలర్ వైభవ్ బాల్ ను అందుకున్నాడు. ఫస్ట్ బాల్ కి రెండు పరుగులు, సెకండ్ బాల్కి 1 పరుగు, మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్సర్ కొట్టటంతో మ్యాచ్ రాజస్థాన్ సొంతం అవుతుంది అనుకున్నారు. కట్ చేస్తే చివరి బంతి యార్కర్ వేయటంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఒక్క పరుగు తేడాతో కలకత్తా జట్టు విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో నిలిచింది. మాన్ ఆఫ్ ది మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ దక్కించుకున్నాడు.
శివ మల్లాల