ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై 1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ఓ సినిమా రూపొందుతోంది. ‘కేజేక్యూ – కింగ్ జాకీ క్వీన్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ ‘దసరా’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కేకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు (బుధవారం) విడుదలైంది.
ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. దీక్షిత్ శెట్టి చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘నగరం, తుపాకి రెండూ ఒక్కటే.. అవి వాటిని పట్టుకున్న వ్యక్తి మాట వింటాయి’ అనే ఆసక్తికర డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శశి ఓదెల ఒక ముఖ్య పాత్రలో నటించాడు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఇక టీజర్ ‘కత్తితో జీవించేవాడు కత్తితో చనిపోతాడు – మత్తయి 26:52’ అనే బైబిల్ నోట్ తో ముగుస్తుంది.