హీరో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కిరణ్ అబ్బవరం, రహస్య దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఇవాళ (గురువారం) రహస్యకు పండంటి మగబిడ్డ జన్మించాడు. పుత్రోత్సాహం మామూలుగా ఉండదుగా.. బాబును చూడగానే కిరణ్ తన కాలిని ముద్దాడుతూ తీయించుకున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో కిరణ్ అబ్బవరం నుదుటున బొట్టుతో కనిపించాడు. భార్య.. బిడ్డను కనబోతోందనగానే దేవుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మొక్కినట్టుగా ఉన్నాడు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య జంటగా నటించారు. అప్పుడు వారిద్దరి స్నేహం కాస్తా.. సినిమా పూర్తయ్యేసరికి ప్రేమగా మారింది. గతేడాది వివాహం చేసుకున్నారు.
ప్రజావాణి చీదిరాల