జీవితంలో ఎవరికైనా పుట్టినప్పటినుండి తల్లి, కట్టుకున్న భార్య చాలా ఇంపార్టెంట్. వేరు వేరు కారణాలతో ఇద్దరు కాలం చేస్తే ఆ మనిషి పడే బాధ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో తనను ఓదార్చి మళ్లీ జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చి ఇలా మాట్లాడటానికి తన స్నేహితులు అండగా నిలుచున్నారట. స్నేహితులు అందరికి ఉంటారు వారిలో కొందరికి మాత్రమే నిజమైన స్నేహితులు ఉంటారు. అన్నీ బావున్నప్పుడు ఉండే స్నేహితుల కన్నా మన పరిస్థితి తల్లక్రిందులైనప్పుడు మనతో ఉండే స్నేహితులే నిజమైన స్నేహితులు. వారు ఒక్కరా, ఇద్దరా, నలుగురా అనే ప్రశ్నే అవసరం లేదిక్కడ. ‘కర్మణ్యే వాధికారిస్తే’ సినిమా నిర్మాత దుర్గాప్రసాద్ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌కి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో అనేక విషయాలను మాట్లాడారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఉంటాయి. అందుకే ఈ ఇంటర్వూ చాలా స్పెషల్‌గా అనిపించింది. ముఖ్యంగా ప్రతి మాటలో తన స్నేహితుల సహకారం గురించి తన సినిమా గురించి చాలా చక్కగా మాట్లాడారు దుర్గా ప్రసాద్. ఆయనేమన్నారో మీరు ఓ లుక్కేయండి….ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు