‘హరి హర వీరమల్లు’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పిన జ్యోతికృష్ణ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలోతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ పిరియాడిక్ డ్రామా రూపొందింది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 24న ఈ సినిమా ప్రేక్లకుల ముందుకు రానుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ జూలై 3న విడుదల కానుంది. ఈ చిత్ర విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇది పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రమే కాకుండా.. తొలిసారిగా చారిత్రక యోధుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో విశేషం.

నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, ‘యానిమల్‌’లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.
‘‘యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని జ్యోతి కృష్ణ అన్నారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.

యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ చూశారు. ఆ స్టార్‌డమ్‌‌కి న్యాయం చేయడానికి, ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. ‘‘నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం’’ అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *