యన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం ‘దేవర’. దాదాపు ఆరేళ్ల తర్వాత యన్టీఆర్ సోలోగా వస్తున్న చిత్రం కావటంతో ‘దేవర’ సినిమా ఫుల్ క్రే జ్‌తో విడుదలైంది.
నిర్మాతలు హరి, సుధాకర్ మిక్కిలినేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .
చాలాకాలం తర్వాత విడుదలైన పెద్ద హీరో సినిమా కావటం, సినిమాలో యన్టీఆర్ నటనతో పాటు అనిరుద్ సంగీతం రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవటంతో పదిరోజుల్లో 466 కోట్ల గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్‌చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ‘దేవర’ సినిమా.
యన్టీఆర్ కెరీర్‌లో అనేక సినిమాలు హిట్లు అందుకున్నప్పటికి బాక్సాఫీస్ కలెక్షన్లు ఈ రేంజ్‌లో వసూలు చేసిన చిత్రం మాత్రం ‘దేవర’నే…..
Also Read This : నాయకులు దిగజారొద్దు–– చిరంజీవి