SSMB 29 :
ఏ పనిచేసినా వందకు వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారు దర్శకుడు యస్.యస్ రాజమౌళి.
ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ( 25 మార్చి 2025) విడుదలై దాదాపు మూడేళ్లవుతున్నప్పటికి మొన్నీ మధ్యే రిలీజయ్యింది అనే ఫీలింగ్‌లో ఉన్నారందరూ.
దానికి కారణం ఆయన క్రియేట్ చేసిన పబ్లిసిటీ సినిమాలోని హీరోలు యన్టీఆర్, రామ్‌చరణ్.
మూడేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్‌బాబుతో సినిమా సెట్స్‌పైకి త్వరలోనే వెళ్లననున్నారు రాజమౌళి.
సినిమాకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తుంది.
ఆయన సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవరనే క్యూరియాసిటి ప్రతి ఒక్కరిలోను ఉంటుంది.
అందుకే రాజమౌళి సినిమాలోని ప్రతి అప్‌డేట్ కీలకంగా మారుతుంది.
మొన్నీమధ్యే మహేశ్‌ను ఉద్ధేశించి ఒక సింహం ఫోటోను ట్యాగ్‌చేస్తూ రాజమౌళి తనదైన స్టైల్లో చిన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు.
ఆ వీడియోను దాదాపు నాలుగుకోట్ల ఇరవైఐదు లక్షలమంది వీక్షించారు.
25 లక్షలమంది లైక్ చేయగా 3 లక్షలకు పైగా షేర్ చేశారు.
ఇక్కడ నంబర్స్ గురించి మాట్లాడుతుంది కేవలం సోషల్ మీడియాలో అయన పెట్టిన చిన్న పోస్ట్ గురించి కాదు.
ఆయన్ని మీడియా ఎంతగా ఫాలో అవుతుంది అని ఈ నంబర్స్ చెప్తున్నాయి.
అలాగే ఫ్రీపబ్లిసిటీ చేసుకోవటంలో రాజమౌళిని మించిన మాస్టర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో.
అంతలా ఆయన చుట్టూ మీడియాని తిప్పుకుంటారాయన.
ఈ మధ్యే సినిమా ఓపెనింగ్‌కి ఎన్నడూ తన సినిమా ఓపెనింగ్స్‌కి రాని మహేశ్‌ని రప్పించుకుని అదొక సంచలన వార్తలా మార్చారు రాజమౌళి.
తర్వాత తన సినిమాలో హీరోయిన్ ప్రియాంకచోప్రా అనే వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
కానీ ఆయన ఆ వార్తను అవును అని చెప్పరు, కాదు అని చెప్పరు.
దానికి కారణం అవును అని చెప్తే ప్రియాంక మహేశ్ సినిమాలో హీరోయిన్ అట, కాదు అంటే ఆమె హీరోయిన్ కాదట అంతటితో ఆ వార్త ముగిసిపోతుంది.
అదే సైలెంట్‌గా ఉంటే బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడేమో సింహంఫోటో పెట్టి చిన్న వీడియో.
మీడియా ఇంకొంచెం ముందుకు వెళ్లి తన సినిమాలను ప్రమోట్ చేస్తుంది.
అదేంటంటే ఈ సినిమా సెట్‌లోకి సెల్‌ఫోన్ అనుమతించరట అనే న్యూస్ స్ప్రెడ్‌చేశారు.
నిజానికి రాజమౌళి గత సినిమాల్లో కూడా సెల్‌ఫోన్ అంతలా ఎంట్రీ ఉండేది కాదు. అందరి ఫోన్లను పక్కన పెట్టి పనిచేసుకునేవారు.
కాకపోతే అప్పటికి ఇప్పటికి సెల్‌ఫోన్ కెమెరాల్లో క్వాలిటీ మరియు సోషల్‌మీడియా విపరీత పోకడలవల్ల కొంతమేరకు సెల్‌ఫోన్‌ను నిషేధించి ఉండొచ్చు.
మామూలు దర్శకులెవరన్నా అయితే హీరోలు, హీరోయిన్లు మాట వినరేమో కానీ అక్కడున్నది జక్కన అలియాస్ రాజమౌళి కాబట్టి ప్రతి ఒక్కరు క్యూలో నిలబడి ఆయన మాట వింటారు.
అందుకే మహేశ్, ప్రియాంకల ఫోన్లు కూడా సెట్‌లో ఉండవట ఇది ఇప్పటి స్పెషల్ న్యూస్.
ఇప్పటివరకు ఒక్కరోజు షూటింగ్ జరగకపోయినా కూడా ఇన్ని న్యూస్‌లు వస్తే
సినిమా షూటింగ్ ప్రారంభం తర్వాత రాబోయే రోజులు ఎలా ఉంటాయో చూడాలిమరి.
ఏదేమైనా భారతదేశాన్ని కళారంగమైన సినిమారంగాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన రాజమౌళికి హ్యట్సాఫ్ చెప్తూ
SSMB 29ని ప్రపంచమంతా ఊహించని స్థాయిలో తీసి మన తెలుగోడు రాజమౌళి అని ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా తీస్తారని నమ్ముతూ…..
అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న సినిమాకి ఆల్ ది బెస్ట్ విషెశ్ తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్…
శివమల్లాల
Also Read This : యన్టీఆర్, మహేశ్‌బాబు రవివర్మను ఎందుకు ఆట పట్టించారు?
