సంయుక్త కూడా అలా చేయబోతోందా? ఫ్యాన్స్‌కు పండగే..

మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్.. ఎంట్రీ ఇవ్వడమే గట్టిగానే ఇచ్చింది. ఆది నుంచి అమ్మడు నటించిన చిత్రాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్సే. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ కూడా తన ఫుట్ స్టెప్ గట్టిగానే వేసింది. తాజాగా అమ్మడి గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోందట. నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’లో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయాలంటూ ఈ ముద్దుగుమ్మకు మేకర్స్ నుంచి కాల్ వెళ్లిందట.

మరి సంయుక్త రెస్పాన్స్ ఏమిటో తెలియలేదు కానీ ఒకవేళ ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ చేసిందో ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అయితే ఇప్పటి వరకూ దీనికి సంయుక్త నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చి అద్భుత విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’ రూపొందుతోంది. ఒక డివోషనల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. దీనిలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ స్పెషల్ సాంగ్ చేసిందంటే.. సినిమాకు ప్లస్ అవడం ఖాయంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *