సినిమా ప్రారంభమైనప్పటి నుంచి తాము అనుకునే వరకూ హీరోలు తమ లుక్ లీక్ కానివ్వరు. అయితే దర్శకధీరుడు రాజమౌళి హీరో అయితే మరింత జాగ్రత్త వహిస్తారు. రాజమౌళి సినిమా ప్రారంభమైందంటే చాలు హీరో పూర్తిగా లాక్ అయినట్టే. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న జక్కన్న పాస్‌పోర్టును సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పాస్‌పోర్టు రిలీజ్ చేశారనుకోండి. అయితే మహేష్‌కు ఒక్క విషయంలో మాత్రం జక్కన్న ఫ్రీడమ్ ఇచ్చేశారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో లుక్ రివీల్ కాకూడదని కండీషన్ పెట్టిన ఆయన మహేష్‌కు మాత్రం అలాంటి కండీషన్ పెట్టినట్టులేరు. అందుకే మహేష్ తన లుక్‌ని వీలైనప్పుడల్లా రివీల్ చేస్తూనే ఉన్నాడు.
పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. వాస్తవానికి సినిమాలోనూ మహేష్ ఇదే లుక్‌లో కనిపిస్తాడా? లేదంటే మరోలానా? తెలియడం లేదు కానీ మహేష్ మాత్రం యాడ్స్‌లో నటిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మౌంటైన్ డ్యూ కోసం మహేష్ తన అగ్రిమెంట్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మౌంటైన్ డ్యూ కోసం ఒక యాడ్.. కూతురు సితారతో కలిసి ఒక యాడ్ చేశాడు. తాజాగా మహేష్ బ్రాండింగ్ చేస్తున్న ఎల్లాయిడ్ ఏసీ కోసం కొత్త ప్రకటనలో హీరోయిన్ తమన్నాతో కలిసి కనిపించాడు. ఈ యాడ్‌లో మహేష్ లుక్ పూర్తి రివీల్ అయిపోయింది. ఆ యాడ్ చూసిన కొందరు షాక్ అవుతుంటుంటే.. మరికొందరు మాత్రం జక్కన్న మాస్టర్ ప్లాన్ మరోలా ఉంటుందని అనుకుంటున్నారు.
ప్రజావాణి చీదిరాల