గులాబి ఏనుగు నుండి ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌…

కొన్ని పోస్టర్స్‌ చూడగానే చాలా హాయిగా పాజిటివ్‌గా అనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో చూసిన వెరైటీ ఇంట్రెస్టింగ్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఏంటంటే పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం 2గా తెరకెక్కుతున్న సినిమా పోస్టర్‌ ఇది.

సినిమా చేస్తున్నాం అంటూ హీరోని మధ్యలో కూర్చోపెట్టుకుని కుడివైపు నిర్మాత నిహారిక కొణిదెల ఎడమవైపు దర్శకురాలు మానస శర్మను పరిచయం చేసే పోస్టర్‌ కథ అది.

ఈ ఏడాదే సినిమా షూటింగ్‌ జరిగి థియేటర్లలోకి సినిమా విడుదల చేస్తాం అనే ఇన్‌ఫర్మేషన్‌తో విడుదల అయిన ఈ పోస్టర్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో పాజిటివ్‌గా కనిపించారు.

నిహారిక కొణిదెల నటిగా బిజీగా లేకపోయినా నిర్మాతగా మారి ‘కమిటీకుర్రాళ్లు’ తొలి సినిమాతోనే టేస్ట్‌ ఉన్న నిర్మాతగా మారారామె.

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ తో సంగీత్‌ శోభన్‌ ఫుల్‌ స్పీడు మీదున్నారు. కొత్త అమ్మాయి మానస శర్మను ఈ చిత్రంతో పరిచయం చేస్తుండటం విశేషం…

శివమల్లాల

Also Read This : ఈ సినిమాతో గ్లోబల్‌గా నన్ను నేను నిరూపించుకుంటా : వి.యన్‌ ఆదిత్య…

Vivaha Bhojanambu Restaurant Raviraju Nagaraju Success Story
Vivaha Bhojanambu Restaurant Raviraju Nagaraju Success Story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *