ప్రభాస్ ‘స్పిరిట్’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

ఒక స్టార్ హీరో సరసన ఎవరైతే బాగుంటుందనేది ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. ఆ జంట వెండితెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండుగే. ఇక నేషనల్ బ్యూటీ దీపికా పదుకొణె అంటే ఎవరికి ఇష్టముండదు? ఈ ముద్దుగుమ్మ తమ అభిమాన హీరో పక్కన నటిస్తే చూడాలని అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అయితే ఈ కోరిక ‘కల్కి 2898 AD’ చిత్రంతో తీరిపోయింది. అయితే ఆ సినిమాలో ఎక్కడా వారిద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు కానీ పెద్దగా కనిపించవు. పార్ట్ 2లో అయితే నాగ్ అశ్విన్ ఎక్కువగా సినిమాను వీరిద్దరి మీదనే నడపవచ్చేమో. అయితే ఈ లోటు అనేది ప్రేక్షకులకు ఉండిపోయింది. అయితే ఆ లోటు త్వరలోనే తీరనుందని మాత్రం తెలుస్తోంది.

ఇప్పుడు మరోసారి ప్రభాస్-దీపికా పదుకొనె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. అంతేకాదు. వీరిద్దరి మధ్య రొమాన్స్ కూడా పీక్స్‌లోనే ఉంటుందని టాక్. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని అంతా భావించారు. అయితే సందీప్ వంగ మాత్రం దీపికా పదుకొణె అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడని టాక్. ప్రభాస్ ఈ పాత్ర ఇప్పటి వరకూ చేసిందే లేదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడ చూడాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన దీపిక అనే వార్తలు వైరల్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *