బిగ్‌బాస్ షో.. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తే తప్ప సక్సెస్ కావడం కష్టం. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్ షో 8 సీజన్లు పూర్తి చేసుకుని 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే షోను సక్సెస్ చేయడం కోసం ఇప్పటికే మేకర్స్ నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆలోచనలకు మెరుగు పెడుతున్నారు. మరోవైపు హిందీ బిగ్‌బాస్ షో వచ్చేసి 18 సీజన్లు పూర్తి చేసుకుని 19వ సీజన్‌లోకి అడుగు పెట్టనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సారి రోబో ఎంట్రీ ఇవ్వబోతుంది. రోబో ఏం చేస్తుంది? అని ఆశ్చర్యపోతున్నారా? హిందీ బిగ్‌బాస్‌లో గతంలో ఏకంగా గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రోబోను తీసుకురావడంలో వింతేముంది?
అసలు ముందుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే రోబో విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈకి చెందిన రోబో పేరు హబబు. దీనికి హిందీ సహా ఏడు భాషలు తెలుసు. ఇక ఏం చేస్తుంది.. అంటారా? చక్కగా పాటలు పాడుతూ అందరినీ ఎంటర్‌టైన్ చేయడమే కాదు.. చక్కగా ఇంటి పనులన్నీ చేసేస్తుందట. ఈ రోబోకి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్‌తో లెహంగాలో బుట్టబొమ్మలా కనిపిస్తోంది. చూడముచ్చటగా ఉన్న ఈ రోబో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిందంటే.. ప్రేక్షకుల కళ్లు మరొకరి మీదకు వెళ్లే అవకాశమే లేదు. మొత్తానికి ఈ రోబో గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి నిజంగా హబుబు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? చూడాలి.