‘హనుమాన్’ సినిమాతో తేజా సజ్జ అద్భుతమైన విజయం అందుకున్నాడు. అక్కడి నుంచి తేజా సజ్జ రేంజే మారిపోయింది. మరోసారి సూపర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మిరాయ్’ అనే క్రేజీ టైటిల్‌తో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను ఇప్పటికే మేకర్స్ మొదలు పెట్టేశారు.
సరికొత్త కథనంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామంటూ మేకర్స్ సినిమాపై హైప్ పెంచేశారు. ఈ సినిమా నుంచి జూలై 26న ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. మంచు మనోజ్ విలన్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శ్రీయ శరణ్, జయరాం, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు వీఎఫ్ఎక్స్ గట్టిగానే వాడారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మొత్తంగా 8 భాషల్లో.. 2డి, త్రిడి ఫార్మాట్లలో విడుదల కానుంది.