భారత్ ఆస్ట్రేలియా బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ నాల్గవ టెస్ట్‌లో ఇండియా 184 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది.
ఇండియా టాప్‌ఆర్డర్ ప్రతిసారి కుప్పకూలటంతో భారీ మూల్యాన్ని దక్కించుకోవలసి వచ్చింది.
నాల్గవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ఎంతో ఓపికగా ఆడి సెంచరీ సాధించిన నితిష్‌కుమార్ రెడ్డి వల్ల ఫాలోఆన్ గండం నుండి బయటపడ్డ భారత్
రెండో ఇన్నింగ్స్‌లో మరో 13 ఓవర్లు ఉండగానే మూటముల్లే సర్దేసింది.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కి (84) తోడుగా రిషబ్‌పంత్ (30) ఒక్కరే రెండంకెల స్కోర్‌ను అందుకున్నారు.
మిగతా మేటి క్రికెటర్లందరూ ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజ్‌లో నిల్చుని రెండంకెల స్కోర్‌ని అందుకోలేకపోయారంటే భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఇండియా పతనానికి కారణం అయ్యారు.
మొదటిటెస్ట్‌ను ఇన్నింగ్స్ వందకు పైగా పరుగుల తేడాతో గెలుచుకున్న టీమిండియా ఆనందం వెంటనే కోల్పోయింది.
రెండవటెస్ట్‌ను సేమ్ అలాంటి తేడాతో ఆస్ట్రేలియా జయించి 5 టెస్ట్‌ల సిరిస్‌ను సమంచేసింది.
మూడవటెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాల్గవ టెస్ట్‌ను ఆస్ట్రేలియా గెలవటంతో 21 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది.
సిరిస్‌ను గెలుస్తుంది అనుకున్న ఇండియా జనవరి 3 నుండి 7వరకు జరిగే 5వ టెస్ట్‌లో విజయం సాధిస్తే సిరిస్‌ను సమం చేసుకుని పరువు కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది.
లేదంటే సిరీస్‌ను ఆస్ట్రేలియాకి అర్పించాల్సి ఉంటుంది. జనవరి 3 నుండి 7వరకు జరిగే 5వ టెస్ట్‌లో పరాజయం పాలైతే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థానం కోల్పోయినట్లే.
యం.సి.జిలో ఒక టెస్ట్‌కి 74వేల మందికి పైగా హాజరు అవ్వటం అనేది 88 ఏళ్ల తర్వాత జరిగింది. ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది.
ఈ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా రోహిత్‌శర్మ కెప్టెన్సీ మరియు టీమ్‌లో ప్లేస్‌ను కోల్పోవటం గురించి పెద్దగా చర్చ నడుస్తోంది.
శివమల్లాల
Also read this : గేమ్‌చేంజర్ ఈవెంట్‌కి పవర్‌స్టార్ ఫిక్స్….