మరోసారి తల్లైన ఇలియానా.. బిడ్డ పేరేంటంటే..

నటి ఇలియానా మరోసారి తల్లి అయ్యింది. ఆమె ఇప్పుడు కాదు.. జూన్‌ 19నే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా బాబు ఫోటోను సోషల్ మీడియాలో ఇలియానా షేర్ చేసింది. బాబు పేరును కూడా ప్రకటించింది. మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్‌’ని పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అనే క్యాప్షన్‌‌తో ఫోటోను ఇలియానా షేర్ చేశారు. దీంతో ఇలియానాకు సెలబ్రిటీలతో పాటు పెద్ద ఎత్తున నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియాంక చోప్రా సైతం ఈ పోస్టుపై స్పందించారు. ఇలియానా, మైఖేల్ డోలన్‌ల వివాహం 2013లో జరిగింది.

అదే ఏడాది ఆగస్టులో ఈ దంపతులు తమ తొలి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు ఇలియానా దంపతులు ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’గా పేరు పెట్టారు. ‘దేవదాస్‌’ మూవీతో ఇలియానా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. గత కొంతకాలంగా అంటే 2018 తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎందుకోగానీ తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది. రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై కనిపించింది లేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *