3 BHK Review: సిద్దార్థ్ మెప్పించాడా?

చిత్రం: 3 BHK
విడుదల తేది: 04-07-2025
నటీనటులు: సిద్దార్థ్, శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, మీతా రంగనాథ్, చైత్ర
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
మ్యూజిక్: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేశ్ శివ
ప్రొడ్యూసర్: అరుణ్ విశ్వ

తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు.. తన పరిస్థితి కొడుక్కి రాకూడని తపించే తండ్రి మధ్య నడిచే కథే ఇది. ఇంటిని గౌరవంగా భావించే తండ్రి ఇల్లు కొనాలని కలలు కంటుంటాడు. మరి కొనగలిగాడా? ఈ నేపథ్యంలో తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కొడుకు తను ఆశించిన విధంగా ఉన్నత స్థాయికి వెళ్లాడా? వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

సినిమా కథేంటంటే..

మద్య తరగతి కుటుంబాల గురించి ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో ఎల్‌బీ శ్రీరామ్ ఒక సుదీర్ఘమైన డైలాగ్ చెబుతారు. ఈ సినిమా చూస్తుంటే మనకు కూడా అది గుర్తుకు వస్తుంది. చాలీచాలని జీతం.. అద్దె ఇంట్లో ఉంటూ ఓనర్లతో పడే చిరాకు.. చిన్నదో పెద్దదో ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆశ.. కానీ అప్పు చేయాలంటే భయం.. ఎలాగోలా ఇల్లు కొనాలి.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని ఒక తండ్రి పడే తపనే ఈ కథ. చివరకు ఇల్లు కొన్నాడా? పిల్లలను తను అనుకున్న గమ్యానికి చేర్చాడా? లేదంటే వారే ఒక టార్గెట్‌ను ఏర్పాటు చేసుకుని అచీవ్ అయ్యారా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

చాలా కాలం తర్వాత దేవయాని తెలుగు తెరపై కనిపించారు. ఆమె తల్లిగా చక్కగా నటించారు. శరత్ కుమార్ అయితే తన పాత్రలో జీవించారు. సిద్దార్థ్ అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. ‘బొమ్మరిల్లు’ మనకు గుర్తొస్తుంది. ఇక మీతా రంగనాథ్, చైత్ర తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు. చిత్రంలో యోగిబాబును తీసుకున్నా కూడా ఎందుకో ఒక చిన్న పాత్రతో సరిపెట్టేశారు.

టెక్నికల్ పరంగా..

ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే కూడా అస్సలు సినిమాకు సెట్ అవలేదు. మ్యూజిక్ అంతంత మాత్రమే. పాటలు ఒకటో అరో ఉన్నా అవి కూడా మెప్పించలేకపోయాయి.

ఫైనల్ వర్డిక్ట్: సినిమా కాదు.. టీవీ సీరియల్

రేటింగ్: 1.75/5

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *