అధిక బరువుతో ఇబ్బంది పడేవారు స్లిమ్‌గా అయ్యేందుకు ఇలా చేయండి..

అధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామాలు చేస్తూ.. ఆహారాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా బరువు తగ్గరు. దీనికి కారణం లేకపోలేదు. ఒకరోజు వ్యాయామం చేస్తే.. రెండు రోజులు స్కిప్ చేయడంతో పాటు తీసుకునే ఆహారంలో కేలరీ డెఫిషిట్ మెయిన్‌టైన్ చేయకుంటే ఏం చేసినా ఫలితం శూన్యం. అయితే తాజాగా ఒక అధ్యయనంలో స్లిమ్‌గా ఉండేవారి రహస్యం ఏంటో తెలిసిపోయింది. నాజూకుగా ఉండేవారంతా ఎలాంటి డైట్ పాటించరని తేలింది.

బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లతో బరువును కంట్రోల్‌లో పెట్టుకుంటారట. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కొందరు ఏమాత్రం ఒత్తిడికి గురైనా కూడా అతిగా తినేస్తుంటారు. తద్వారా బరువు పెరుగుతారు. వ్యాయామం చేస్తూ తగు పాళ్లలో ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు ఫిట్‌నెస్‌తో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందట. తప్పనిసరిగా తమ బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారట. వారంలో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ సార్లు వ్యాయామం చేస్తారని అధ్యయనంలో తేలింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *