Rajeev Kanakala
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. దీంతో స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో రూపొందిన సిరీస్.. ‘హోం టౌన్’.
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.
ఈ నెల 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఈ క్రమంలోనే నేడు మీడియా కోసం ప్రివ్యూ వేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘హోం టౌన్’ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా.
ఈ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి.
ఈ సిరీస్ లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ వచ్చేసింది..