చిరు, శ్రీకాంత్ ఓదెల కాంబోపై నాని ఇచ్చిన అప్‌డేట్ తెలిస్తే..

 

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. సినిమా వివరాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇది సర్వసాధారణం. ప్రస్తుతానికి చిరు నటిస్తున్న సినిమాలన్నింటికి సంబంధించిన అప్‌డేట్ అభిమానుల వద్ద ఉంది కానీ ఒక సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు. తాజాగా దీనిపై నేచరుల్ స్టార్ నాని క్లారిటీ ఇచ్చేశాడు. ‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై మరింత ఆసక్తితో పాటు అంచనాలూ పెరిగాయి. ప్రస్తుతం మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రూపొందనుంది కాబట్టి శ్రీకాంత్ ఓదెలతో సినిమా ప్రారంభానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

అయితే అభిమానులు మాత్రం చిరు, నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో గురించి ఎక్కువ ఆరా తీస్తున్నారు. తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై స్పందించాడు. చిరు, శ్రీకాంత్ కాంబో గురించి నాని ఇచ్చిన అప్‌డేట్ గురించి తెలిస్తే అభిమానులు ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం నాని ‘హిట్ 3’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈక్రమంలోనే చిత్రానికి సంబంధించి బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. మే 1న ‘హిట్ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నానిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దీనిలో భాగంగా మీడియా ప్రతినిధులు చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబో గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించని నాని.. ప్రస్తుతం తాను ‘ప్యారడైజ్’ అనే సినిమా చేయాల్సి ఉందని.. కాబట్టి దాని షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపాడు. ‘ప్యారడైజ్’ సినిమా పూర్తైన వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ మొదలవుతుందని వెల్లడించాడు. ఈ మెగా ప్రాజెక్టును 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అయితే కానీ వివరాలన్నీ తెలిసే అవకాశం లేదు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *