Rashmika Mandanna: సిగిరెట్స్ తాగను.. ఆ అవసరమే వస్తే…

రష్మిక మందన్నా అవడానికి కన్నడ ముద్దుగుమ్మ అయినా కూడా ఆమెకు లైఫ్ ఇచ్చింది.. స్టార్‌గా నిలబెట్టింది మాత్రం టాలీవుడే. ఏ ముహూర్తంలో ‘ఛలో’ సినిమా చేసిందో కానీ ఆ తరువాత అమ్మడికి దశ తిరిగి పోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏ సినిమా చేసినా అది పక్కా హిట్ అనే టాక్ ఉంది. ఇక ఇటీవలి కాలంలో తమిళ్, బాలీవుడ్ చిత్రాల్లోనూ తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. బాలీవుడ్‌లో నటించిన ‘యానిమల్’ చిత్రం అమ్మడికి అక్కడ మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రణబీర్ కపూర్ పాత్రపై దారుణంగా విమర్శలొచ్చాయి.

దీనికి కారణం.. ‘యానిమల్’ చిత్రంలో రణబీర్ ఎక్కువగా సిగరెట్స్‌ కాల్చడమే. ఆ సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే.. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇటీవల ఒక సందర్భంలో దీనిపై స్పందించిన రష్మిక.. తాను కేవలం దానిని ఒక చిత్రంగానే చూశానని తెలిపింది. తాను మాత్రం సిగిరెట్స్ తాగే సన్నివేశాల్లో నటించబోనని తెలిపారు. ఒకవేళ తనకు అలాంటి పాత్ర వస్తే.. సినిమాను అయినా వదులుకుంటాను కానీ సిగిరెట్ తాగే సన్నివేశాల్లో మాత్రం నటించబోనని తెలిపారు. ఒక్కో వ్యక్తికి ఒక్కో బ్యాడ్ హాబిట్ ఉంటుందని చెప్పేందుకే యానిమల్ చిత్రంలో హీరోను దర్శకుడు అలా చూపించారని రష్మిక తెలిపింది. ఏది ఏమైనా సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా సినిమా మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *