హీరో ప్రదీప్ రంగనాథ్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించతలపెట్టింద. ఈ సినిమాకు ‘డ్యూడ్’ అనే పేరు ప్రకటించింది. తాజాగా దీనిపై ఇదే టైటిల్ ‘డ్యూడ్’ అనే సినిమాను తీసిన చిత్ర కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత తేజ్ స్పందించారు. తాను ఏడాది నుంచి ‘డ్యూడ్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మైత్రి వంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఇప్పటికే విసయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ దృష్టికి తీసుకెళ్లినట్టు సైతం తేజ్ వెల్లడించారు. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తేజ్.. ‘డ్యూడ్’ను త్రిభాషా చిత్రంగా రూపొందించారు.
ఫుట్ బాల్ గేమ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ఫుట్‌బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా రంగాయన రఘు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్ తెరకెక్కుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల