చిత్రం: మై బేబీ
విడుదల తేదీ: 18-07-2025
నటీనటులు: అధర్వ మురళఇ, నిమిషా సాజయన్
దర్శకుడు: నెల్సన్ వెంకట్
నిర్మాత: సురేశ్ కొండేటి, సాయి చరణ్ తేజ్
కొన్ని సినిమాలు మన కళ్లకు ఇంపుగా ఉంటాయి. కొన్ని సినిమాలు మనసుకు నచ్చుతాయి. కళ్లకు ఇంపుగా అనిపించిన సినిమాలను రెండు రోజుల పాటు గొప్పగా చెబుతాం.. ఆ తరువాత మరచిపోతాం. కానీ మనసుకు నచ్చిన చిత్రాలు ఎప్పటికీ అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే ‘మై బేబీ’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘మై బేబీ’ పేరుతో తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఒక కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే.. కానీ మనం పెద్దగా పట్టించుకోం. సమాజంలో జరిగే ఒక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ ఒక అద్భుతమైన కథను అల్లి మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఒక యాక్సిడెంట్ సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటనను నేపథ్యంగా కథ సాగుతుంది. సినిమా ఎక్కడా కూడా బోర్ అనిపించదు. తొలి అర్థభాగమంతా యాక్సిడెంట్.. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆసుపత్రి సన్నివేశాలతో కథ సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగుతుంది. ఎక్కడా కూడా సినిమా బోర్ అనిపించదు. రెండు పార్టులు చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. ఎక్కడా మన ఊహలకు అసలేం జరుగుతుందన్నది అందనివ్వకుండా స్క్రీన్‌ప్లే అద్భుతంగా కొనసాగింది. అన్ని పాత్రలు కూడా వాటి పరిధి మేరకే మనకు కనిపిస్తాయి మినహా ఎక్కడా కూడా ఎక్స్‌ట్రాగా మనకు అనిపించవు.
హీరోహీరోయిన్‌ల నటన, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలం. నిమిషా నటన బిడ్డ కోసం తల్లడిల్లే అమ్మను కళ్లకు కడుతుంది. అథర్వ నటన కూడా అద్భుతం. కథలో చాలా ఇన్వాల్వ్ అయి మరీ చేశాడు. కథకి మూలం చిన్న పాయింటే అయినా కూడా దాని చుట్టూ అల్లిన కథ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఫైటింగ్ సన్నివేశాలు ఉన్నాయి కానీ ఎక్కడా ఎక్స్‌ట్రాగా మనకు అనిపించవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలు మాత్రం అంతగా మెప్పించవు. దర్శకుడు కథను చెప్పిన తీరు మెప్పిస్తుంది.
ఫైనల్ వర్డిక్ట్: ‘మై బేబీ’ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
రేటింగ్: 3.25/5