...

Hit 3: ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘హిట్ 3’

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ హిట్ మూవీ ‘హిట్ 3’ ఈ నెల 1న విడుదలై మంచి సక్సెస్ సాధించింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు పెద్ద సమయం కూడా తీసుకోలేదు. రెండు వారాల్లోనే చేరిపోయింది. ‘హిట్’ ఫ్రాంచైజీతో సూపర్ హిట్స్ కొడుతున్న శైలేష్ కొలనుకు ఈ సినిమా కూడా కావల్సినంత బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. జూన్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.