‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘హిట్ 3 (ది థర్డ్ కేస్)’ విడుదలకు సిద్ధమవుతోంది. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందింది. తొలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌లో అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాలో నాని క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందనేది చెప్పింది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచేశారు. అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల బృందం సైతం సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. మొత్తం పాన్ ఇండియా లెవల్‌లో ఇరగదీసేందుకు అర్జున్ సర్కార్ సిద్ధమైపోయాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా?