కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమాలో త్రిష, శింబు, అభిరామి ముఖ్య పాత్రలు పోషించగా.. నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా మీడియా మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శింబు ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఓజీలో సాంగ్ పాడటంపై స్పందించాడు. శింబు మాట్లాడుతూ… ‘‘తెలుగు ఆడియన్స్ నాకు చాలా స్పెషల్. నా బిగినింగ్ కెరియర్‌లో మన్మథ సినిమాకి తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోలేను. ఓజీ సాంగ్ కూడా త్వరలో రాబోతుంది. పవన్ కల్యాణ్ గారి కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్’’ అన్నారు
ప్రజావాణి చీదిరాల