పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురు చూపులకు ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని వారు కూడా ఊహించి ఉండరు. ఇవాళ (గురువారం) పవన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో పవన్ ఇంట్రడక్షన్ సీన్ వచ్చేసి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ రేంజ్‌లో పవన్‌కు ఎలివేషన్ ఇచ్చారు. ఒక చారిత్రాత్మక చిత్రాన్ని అత్యంత వైభవంగా ప్రేక్షకుల ముందుకు దర్శకుడు జ్యోతికృష్ణ తీసుకు వస్తున్నారనడంలో సందేహమే లేదని ట్రైలర్ చూసిన వారెవరికైనా అర్థమవుతుంది.
మూడు నిమిషాల నిడివితో వదిలిన ఈ ట్రైలర్ సినిమా రేంజ్ ఏంటనేది చెప్పకనే చెప్పేసింది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించిన యోధుడు, మొఘల్ శక్తిని ధిక్కరించిన వీరుడు ‘వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత అపఖ్యాతి పాలైన పాలకులలో ఒకరైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. ‘కోహినూర్ వజ్రం’ కోసం పోరాటం, మొఘలులతో వీరమల్లు తలపడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఆంధీ వచ్చేసింది’ అంటూ ఆకట్టుకునే డైలాగ్స్‌తో ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మరింతగా ఆకట్టుకున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చేలా ట్రైలర్ ఉందనడంలో సందేహమే లేదు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రజావాణి చీదిరాల