‘హరి హర వీరమల్లు’ ఏ నాయకుడి కథా కాదు.. అసలు స్టోరీ ఏంటంటే..

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’? ఈ సినిమా గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవమూ లేదు. వాస్తవానికి ఈ సినిమా నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా.. ఒక ఫిక్షనల్ స్టోరీగా దీనిని మలిచారు.

పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే ‘హరి హర వీరమల్లు’ను శివుడు, విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం. సరిగ్గా గమనిస్తే, హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం ‘వీరమల్లు’ అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల రూపంగా కనిపిస్తాడు. అదన్నమాట కథ. మొత్తానికి ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *