అనిరుధ్ రవిచందర్ దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకులలో ఒకరు.
1990, అక్టోబర్ 16న చెన్నైలో జన్మించిన అనిరుధ్, నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు మరియు రజనీకాంత్ బంధువు.
సంగీతంలో సంప్రదాయ హిందూస్థానీ, కార్నాటిక్ శైలుల్ని పాప్, EDM, హిప్‌హాప్ వంటి ఆధునిక శైలులతో కలిపి, తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు.
కెరీర్ హైలైట్స్
1. “కొలవెరి డి”తో సంచలనం”
అనిరుధ్ తన తొలి సినిమా 3 (2012)లో “Why This Kolaveri Di” పాటతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈ పాట యూట్యూబ్‌లో పెద్ద హిట్‌గా మారింది, అతని సంగీత జీవితానికి మంచి ఆరంభాన్ని ఇచ్చింది.
2. అనిరుధ్ ముఖ్యంగా రజనీకాంత్, విజయ్, ధనుష్, కమల్ హాసన్, శివకార్తికేయన్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు.
ధనుష్‌తో చేసిన సినిమాలు (VIP) రఘువరన్ B.Tech , మారి హిట్ అయ్యాయి.విజయ్‌తో కత్తి, మాస్టర్ వంటి సినిమాలు యువతలో విపరీతమైన ఆదరణ పొందాయి. తను సంగీతం చేసిన ప్రతి చిత్రం అనుకున్న దానికి మిచ్చి విజయం కాగా ప్రజలనుచి ప్రత్యేక గుర్తిపు లభించింది.
3.అనిరుధ్ సంగీతాన్ని మాత్రమే కాకుండా లైవ్ కాన్సర్ట్‌లు కూడా నిర్వహించి అభిమానులను ఆకట్టుకుంటారు. విదేశాల్లో కూడా పలు ప్రదర్శనలు ఇచ్చారు
4.అనిరుధ్ సంగీతంలో క్యాచీ బీట్‌లు, బేస్‌లైన్‌లు, వినూత్నమైన మెలోడీలు ఉంటాయి. ప్రతి ఆల్బమ్‌లో కొత్త శైలిని ప్రయత్నించడం అతని ప్రత్యేకత.
5. 2023లో అనిరుధ్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించారు. ఈ చిత్రం కూడా అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.
సంగీత పరిశ్రమకు తన విశేషమైన కృషితో, అనిరుధ్ తనను తాను నిజమైన మాస్ట్రో అని నిరూపించుకున్నాడు.
అనిరుధ్ ప్రస్తుతం తమిలంలోనే కాకుండా,తెలుగు, హిందీ సినిమాల్లో కూడా తన స్థాయిని పెంచుకుంటూ, పాన్-ఇండియా స్థాయి సంగీత దర్శకుడిగా ఎదుగుతున్నారు.
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటు ట్యాగ్ తెలుగు.కామ్ మరియు ట్యాగ్ యూట్యూబ్ ఛానల్..
Also Read This:-మొత్తానికీ “క”మూవీ రిలీస్ డేట్ వచ్చేసింది.