Guntur Kaaram:
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.
ఈ మూవీ యొక్క షూటింగ్ ఇటీవల మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటోంది.
ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారంకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇందులో సీనియర్ నటి రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్,రఘుబాబు, జగపతిబాబు, మహేష్ ఆచంట, సినీ, హైపర్ ఆది, బ్రహ్మానందం కీలక పాత్రలు చేస్తుండగా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
నిజానికి మొదట కొంత శాతం మూవీకి పీఎస్ వినోద్ వర్క్ చేసారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో మనోజ్ ని తీసుకున్నారు మేకర్స్.
ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్, ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఎరపరిచాయి.
దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో
తప్పకుండా గుంటూరు కారం బ్లాక్ బస్టర్ కొడుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ ఎంతో గట్టి నమ్మకంతో ఉన్నారు.

ముఖ్యంగా మహేష్ బాబు ఎన్నో ఏళ్ళ తరువాత మాంచి మాస్ పాత్ర చేస్తున్న ఈమూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
విషయం ఏమిటంటే, ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, అలానే సెకండ్ హాఫ్ అయితే ఒకింత మెల్లగా ఆరంభం అయినప్పటికీ ఒక్కసారిగా పుంజుకుని ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని టాక్.
ఇక లాస్ట్ అరగంట అయితే అటు ఎమోషన్స్ తో పాటు ఇటు మాస్ అంశాలు, ఎలివేషన్ సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయని టాలీవుడ్ వర్గాల టాక్.
మొత్తంగా అయితే గుంటూరు కారం మూవీ అందరికీ ఫుల్ ఐ ఫీస్ట్ ని అందించడంతో పాటు అతి పెద్ద విజయం కూడా అందుకే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ రిలీజ్ అంతరం ఏ రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?