పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. అసలు ఈ సినిమా నుంచి అప్డేట్ ఎఫ్పుడు వస్తుంది? అసలు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది నిన్న మొన్నటి వరకూ మిలియన్ డాలర్ ప్రశ్నగా అభిమానులకు మిగిలిపోయింది. దర్శకుడు మారుతి ఈ సినిమాను ఎంతలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడో కానీ సినిమా నుంచి ఒక్క అప్డేట్ను కూడా వదల్లేదు. తాజాగా ఉత్కంఠకు తెరపడింది. రాజాసాబ్ రిలీజ్ డేట్‌తో పాటు.. సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మేకర్స్ ప్రకటించారు.
సినిమా ఈపాటికే విడుదలై ఉండాలి కానీ ఇంకా షూటింగే పూర్తి చేసుకోలేదు. ఫైనల్‌గా ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. గత రెండు నెలలుగా సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేకర్స్ మాత్రం ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. టైమ్ కూడా ఫిక్స్ చేశారు. జూన్ 16న ఉదయం 10.52 కి రాజా సాబ్ టీజర్ విడుదల కానుంది. మొత్తానికి మేకర్స్ అయితే ఒక్క ప్రకటనతో రెండు సర్ప్రైజ్లు ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.
ప్రజావాణి చీదిరాల