మలయాళ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. మలయాళ చిత్రాలకు దేశవ్యాప్తంగా క్రేజ్. అదిరిపోయే కంటెంట్‌తో ఈ చిత్రాలు రూపొందుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మలయాళం నుంచి మరో సినిమా రాబోతోంది. అదే ‘సూత్రవాక్యం’. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ‘జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్’ ద్వారా విడుదల కానుంది. ఇదే సంస్థ ‘సూత్రవాక్యం’ పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తోంది.
పోలీస్ స్టేషన్స్‌కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది… పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలి? వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మంచి కామెడీతో సందేశాత్మకంగా కొనసాగుతుందని తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారా యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో… కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో… షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్లో… యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో “సూత్రవాక్యం” తెరకెక్కడం గమనార్హం. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో “సూత్రవాక్యం” విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల