Gold
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది చేసుకుంటూ పోతున్నారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై సుంకాలను విధించి ఇకమీదట అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు.
అయితే కనీసం తమ ఉత్సత్తులపై 10% సుంకం చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు.
ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ షేక్ అయిపోయింది.
అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పతనం దిశగా పయనిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బంగారం ధరలు ఉవ్వెత్తున ఎగిశాయి. రికార్డ్ స్థాయికి బంగారం ధర చేసుకుంది.
భారత్‌లో బంగారం ధర కేవలం ఆరు రోజుల్లో 100 గ్రాములపై రూ.35 వేలు పెరగడం షాక్‌కు గురి చేస్తోంది.
తులం బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరుకోవడం గమనార్హం.
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.92000 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.85,100కు చేరుకుంది.
Also Read This : గులాబి ఏనుగు నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్…