రామాయణ మహాకావ్యం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అయినా సరే.. ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘రామాయణ’ మూవీ రూపొందుతోంది. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రావణుడి పాత్రలో యశ్ నటిస్తుండగా.. లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తున్నారు. అలాగే పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ తారాగణాన్ని పలు పాత్రల కోసం తీసుకున్నారు. ఈ సినిమా రెండు భాగాల్లో రూపొందనుంది. తొలి భాగం దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం 2027లో విడుదల కానుంది. ఇప్పటికే రామాయణ తొలి భాగం షూటింగ్ పూర్తైంది.
తాజాగా మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిమూర్తులు ముల్లోకాలను పాలిస్తున్నారు. బ్రహ్మ.. సృష్టించే దేవుడు, విష్ణువు.. రక్షించే దేవుడు, శివుడు.. అంతం చేయగలిగే దేవుడు.. కానీ వారి సృష్టించిన మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం మొదలైంది’’ అంటూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ’గా మేకర్స్ పేర్కొన్నారు. ఈ గ్లింప్స్‌లో రణబీర్, యశ్‌లను అద్భుతంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ గ్లింప్స్‌కు బాగా కలిసొచ్చింది. మొత్తానికి సినిమాపై అంచనాలను పెంచేలానే గ్లింప్స్ ఉంది.