ఆరు నెలల్లో నాలుగు విశేషాలు

ఫుల్‌ జోష్‌లో కిరణ్‌ అబ్బవరం..

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు కిరణ్‌ అబ్బవరం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

గతేడాది ఆగస్ట్‌ 22న తనతో పాటు ‘రాజావారు– రాణిగారు’ చిత్రంలో నటించిన హీరోయిన్‌ రహస్యగోరక్‌ను వివాహం చేసుకున్నారు కిరణ్‌.

దీపావళి పండక్కి ‘క’ చిత్రంతో వచ్చి ప్రేక్షకులను సంభ్రమాశ్యర్యాలకు గురిచేశాడు.

ఆ విధంగా రెండునెలల గ్యాప్‌లోనే రెండు గుడ్‌న్యూస్‌లను పంచుకున్నారు కిరణ్‌ అబ్బవరం.

గతేడాది విడుదలైన టాప్‌ బాక్సాఫీస్‌ హిట్‌లలో కిరణ్‌ నటించిన ‘క’ సినిమా కూడా ఉండటం విశేషం.

ఇప్పుడు ‘దిల్‌రుబా’ అంటూ ఫిబ్రవరి 14న మరో సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తాను తండ్రి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

గత ఆరు నెలలు కిరణ్‌ లైఫ్‌లోనే బెస్ట్‌ మూమెంట్స్‌ అంటున్నారు.

‘ఆరు నెలల్లో నాలుగు విశేషాలు అంటూ ఫుల్‌ జోష్‌లో ఉన్న కిరణ్‌ అబ్బవరంకి అభినందనలు తెలియచేస్తున్నారు.

ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు ఫాదర్‌హుడ్‌ అంటూ ట్యాగ్ తెలుగు కిరణ్‌కి రహస్యకి బెస్ట్‌ విషెశ్‌ తెలియచేస్తుంది.

శివమల్లాల

Also Read This : ఆమె సూపర్‌స్టార్‌ వైఫే కాదు…స్టార్‌ కూడా…

Divi Vadthya First Podcast in Tagtelugu
Divi Vadthya First Podcast in Tagtelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *