IPL: ఎట్టకేలకు ఎస్ఆర్‌హెచ్ 4 వ విజయం.. మ్యాచ్ గెలిచినా..

ఐపీఎల్ 61 వ మ్యాచ్ సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్. లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఓపెనర్స్ మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 65 పరుగులు ( 6 ఫోర్లు 4 సిక్సర్లు) , ఏడెన్ మార్క్రమ్ 38 బంతుల్లో 61 పరుగులు ( 4 ఫోర్లు 4 సిక్సర్లు)తో చెలరేగి ఆడటంతో 63 బంతుల్లో తొలి వికెట్కి 115 పరుగులు జోడించారు. వారి తర్వాత క్రీజులోకి వచ్చిన వారిలో నికోలస్ పూరన్ ఒక్కడే 25 బంతుల్లో 45 పరుగులు ( 4 ఫోర్లు 1 సిక్సర్) కొట్టాడు. మిగిలిన బ్యాటర్లందరూ సింగల్ డిజిట్కే పరిమిత మయ్యారు. విచిత్రమేంటంటే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో బాగా ఆడిన బ్యాట్స్మెన్స్ ముగ్గురు నాన్ ఇండియన్ ప్లేయర్స్. ఆ జట్టు లోని మిగతా ఆటగాళ్లు అందరూ కలిసి పట్టుమని 35 పరుగులు మాత్రమే చేసి లక్నో స్కోర్ బోర్డును 205 పరుగులకే పరిమితం చేశారు. లేదంటే మొదటి పది ఓవర్లలో ఓపెనర్స్ వికెట్ పడకుండా ఆడిన ఆటకు స్కోర్ 230 పరుగులు పైనే ఉంటుంది అనుకున్నారు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హైదరాబాద్ జట్టు ఓపెనర్స్ లో ట్రావిస్ హెడ్ లేకపోవడంతో అథర్వ తో కలిసి బ్యాటింగ్ చేశాడు.

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అథర్వ 9 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి 13 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 28 బంతుల్లో 35 పరుగులు ( 3 ఫోర్లు 2 సిక్సర్లు) తో కలిసి అభిషేక్ శర్మ 20 బంతుల్లో 59 పరుగులు (4 ఫోర్స్ 6 సిక్సర్లతో) ఇద్దరు కలిసి 35 బంతుల్లో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 99 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ కావడంతో క్లాసెన్ క్రీజ్ లోకి వచ్చాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 47 పరుగులు చేసి హైదరాబాద్ కు విజయాన్ని అందించాలో కీలకంగా మారాడు. క్లాసన్ తో పాటు జత కలిసిన కమిందు మెండిస్ 21 బంతుల్లో 32 పరుగులు ( 3 ఫోర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నలుగురు ఆటగాళ్లు కలిసి బాగా ఆడటంతో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఎస్ఆర్‌హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలోనే నిలిచింది. మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను అభిషేక్ శర్మ సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *