ప్రస్తుతం ఎక్కడ చూసినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించే చర్చ.
తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్‌ను అభిమానులంతా చూడటం జరిగింది.
‘దేవర’ తర్వాత ‘వార్ 2’ మూవీ షూటింగ్‌లో తారక్ బిజీ అయిపోయాడు.
అప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఏవో అప్‌డేట్స్ రావడం తప్ప ఎన్టీఆర్ అయితే పెద్దగా బయట కనిపించింది లేదు.
తాజాగా మూవీ సక్సెస్‌మీట్‌లో చూడటమే. ఆయన్ను చూసిన అభిమానులంతా పెదవి విరుస్తున్నారు.
‘ఆది’, ‘సాంబ’, ‘రాఖీ’ వంటి చిత్రాల సమయంలో ఆయన చాలా ఫ్యాటీగా కనిపించారు.
ఆ తరువాత రాజమౌళి సలహాతో ‘యమదొంగ’ చిత్రం కోసం స్లిమ్‌గా తయారయ్యాడు.
ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కోసం కాస్త బరువు పెరిగాడు. అది పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేదు.
దీంతో ‘దేవర’ చిత్రంలో కూడా అదే ఫిజిక్‌తో కనిపించాడు.
ప్రస్తుతం ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా మారిపోయాడు.
తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో చూస్తే జీరో సైజ్‌లో కనిపించాడు.
ఫేస్ మరింత కోలగా మారిపోయి.. కలర్ తగ్గిపోయి.. ఒక గ్లో అయితే పోయిందనే చెప్పాలి.
ఎన్టీఆర్‌ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
మరి ఇంతలా తగ్గాలా? గ్లో పోయిందంటూ పెదవి విరుస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ కోసం ఎన్టీఆర్ గట్టిగానే వర్కౌట్స్ చేసినట్టున్నాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఫస్ట్ షాట్