‘హరి హర వీరమల్లు’ మేకర్స్ ఎందుకోగానీ పెద్దగా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. సినిమా చూస్తే విడుదలకు వారం కూడా సమయం లేదు. జూలై 24న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు? ఏఐని ఉపయోగిస్తున్నారో.. మరో రకంగానో మొత్తానికి సినిమా ప్రమోషన్స్ బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. తమ అభిమానం ఏ రేంజ్‌లో ఉందో చూపిస్తున్నారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మొదలు.. ఎయిరిండియా, ఇండిగో విమానాలు, రైళ్లు, బస్సులు, విజయ పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బింగో చిప్స్ ఇలా ఏదీ వదలడం లేదు.
కాదేదీ ప్రమోషన్‌కు అనర్హం అన్నట్టుగా అన్నింటి మీదా ‘వీరమల్లు’ పోస్టర్‌ను క్రియేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నిజమే అయి ఉండొచ్చు కానీ కొన్నింటిపై మాత్రం ఏఐని ఉపయోగించో మరో రకంగానో క్రియేట్ చేశారు. తాజాగా విజయ్ మిల్క్ ప్యాకెట్లపై ‘హరి హర వీరమల్లు’ పోస్టర్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్‌పై ఆ సంస్థ ఎండీ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని.. నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడం నేమని ఆయన పేర్కొన్నారు. తమ బ్రాండ్ బాగా పాపులర్ అవడంతో ఇలా క్రియేట్ చేసి ఉంటారన్నారు. ఏది ఏమైనా ఇది కూడా ‘వీరమల్లు’ ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందనడంలో సందేహమే లేదు.
`