Dr.Vineela :
మీ వంటిల్లే మీ ఆరోగ్యం అంటూ తనకు తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందించి అతి తక్కువకాలంలో ఎంతోమందికి దగ్గరయ్యారీ న్యూట్రిషియనిస్ట్. చిన్న చిన్న వంటింటి చిట్కాలతో ఎంతోమందికి మేలు చేసేలా వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌ను తన సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేశారీమె. గతంలో కర్రీపాయింట్ బిజినెస్, జిమ్ తదితర వ్యాపారాలు చే సే ఫ్యామిలీ మాది అని తన కుటుంబం తన బలమని చెప్పుకొచ్చారామె. ముఖ్యంగా తన భర్త తనకు బ్యాక్‌బోన్‌లా నించుని తన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డారని తెలియచేశారామె. తాను లేకపోతే నేను లేను అంటూ తన భర్తపై తనకున్న అనురాగాన్ని చెప్పారామె. 2022 నుండి వి స్పార్కిల్ పేరుతో మాదాపూర్‌లో క్లినిక్ ఓపెన్ చేశారట. హైదరాబాద్‌లో బ్రాంచ్ నుండి క్లినిక్‌ను మెయింటైన్ చేస్తూనే ప్రపంచంలోని అనేక దేశల్లోని తెలుగు వారందరికి న్యూట్రిషియనిస్ట్‌గా దగ్గరయ్యాను అంటూ తన కథను చెప్పారు వి స్పార్కిల్ అధినేత వినీలా కొండపల్లిగారు. ఆమె మాట్లాడుతూ త్వరలోనే బెంగుళూరు, చెన్నైల్లో తన సేవలను విస్త్రుతం చేస్తున్నా. నా దగ్గరకు వచ్చిన ఎవరికైనా నా డైట్ నేను చెప్పినట్లు చేయగలిగితేనే నా క్లినిక్ రండి అంటుంటాను. నా డైట్ ఫాలో అవ్వకుండా డబ్బులు కట్టి మీరు ఫీలవ్వొద్దు, న న్ను ఫీల్ చేయొద్దు అంటుంటాను. అలాగే నా దగ్గరకి వచ్చే ప్రతి ఒక్కరికి వెయిట్, హైట్, బియంఐ చెక్ చేసిన తర్వాత ఒకే ఇంట్లో ఉండే ఇద్దరికి సేమ్ డైట్ అయితే ఒకటే ఫీజ్ తీసుకుని వాళ్లకి నా ఆడియోలు పంపుతాను. వాళ్లు ఆ ఆడియోను ఎంతమందికైనా పంపుకోవచ్చు అన్నారు వినీలా. ఆమె గురించి ఆమె క్లైయింట్స్ గురించి తన క్లినిక్ గురించే కాకుండా మానసికంగా ఎలా ఎదగాలి? అనే విషయం గురించి ఆమె మాటల్లో అనేక విషయాలు ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో తెలియచేశారు వినీలా కొండపల్లి. ఇకనుండి కంటిన్యూగా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్లో తన వీడియోలు ప్రజెంట్ చేస్తానని అన్నారామె. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This: గద్దర్ అవార్డ్సు గురించి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం: ఎఫ్.డి.సి చైర్మెన్ దిల్ రాజు
