ఎందుకోగానీ ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రాల్లో ‘రాజాసాబ్’ కంటే ‘స్పిరిట్’కే హైప్ ఎక్కువ. ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. భారీగా అంచనాలను సొంతం చేసుకుంది. మరి సినిమా షూటింగ్ ఎందుకోగానీ చాలా ఆలస్యమైంది. అభిమానులైతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సహా ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తైంది. సినిమా షూటింగ్ కోసం కొన్ని ప్రదేశాలను మేకర్స్ పరిశీలించారు. సెప్టెంబర్‌లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం.
ఒకసారి షూటింగ్ మొదలైందంటే మాత్రం బ్రేక్ లేకుండా చేస్తారట. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే స్పిరిట్‌ను మొదలు పెట్టేస్తాడట. ‘రాజాసాబ్’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. కాబట్టి ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో పూర్తి చేస్తేనే ఆపై గ్రాఫిక్ వర్క్ సహా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అనుకున్న సమయానికి పూర్తవుతుంది. మొత్తానికి ‘స్పిరిట్’ షూటింగ్‌కి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ప్రభాస్ ఇలాంటి పాత్రలో కనిపించింది లేకపోవడంతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.