బాలీవుడ్ అందమైన జంటల్లో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంట ఒకటి. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరి పాప పేరు దువా. ఇద్దరూ స్టార్స్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైలో ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలోని అత్యంత సంపన్న నివాసాలలో ఇది కూడా ఒకటి కానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఇంటి గురించే చర్చ. ముంబై మీడియా అయితే ఈ ఇంటి చుట్టూనే పర్యటిస్తోంది. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంటి సమీపంలోనే రణ్‌వీర్ కొత్తిల్లు ఉంటుంది. అరేబియా సముద్రానికి అభిముఖంగా అందంగా.. చూడముచ్చటగా, సకల సౌకర్యాలతో ఉంటుందీ నివాసం. నాలుగు అంతస్తుల్లో ఈ ఇల్లు విస్తరించి ఉంటుంది. 11,266 చదరపు అడుగుల స్థలంలో ఉన్న ఇంటిలో టెర్రస్ వచ్చేసి 1300 చదరపు అడుగులు. సీ ఫేసింగ్‌తో టెర్రస్ ఉంటుంది. కొత్తింట్లోకి దీపిక, రణవీర్ దంపతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెళతారట.