అల్లు అర్జున్ (Allu Arjun), సమంత (Samantha) ఇద్దరికి ఇద్దరూ అద్భుతమైన నటులే. వీరిద్దరూ జంటగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌కు అంతకుమించి ఏం కావాలి? ఇద్దరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. ఈ జంట వెండితెరపై చేసే మ్యాజిక్ ఏంటో మనం ఇప్పటికే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో చూసేశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్ (Pushpa)’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా…’లో ఇద్దరూ కలిసి వేసిన స్టెప్స్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ మరచిపోలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబోలో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో సమంతే హీరోయిన్ అంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్‌తో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. మెయిన్ హీరోయిన్స్ ఇద్దరిలో ఒకరు సమంత అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్‌లో ఈ చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనుందట. మొత్తానికి అల్లు అర్జున్, సమంత మరోసారి జత కడితే మాత్రం ఫ్యాన్స్‌ను పట్టుకోవడం కష్టమే. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల