సంక్రాంతి పండుగ హడావుడిలో తెలుగు బాక్సాఫీస్ గేమ్ కొత్త మలుపులు తీసుకుంటోంది. అయితే ఈ గేమ్ లో దిల్ రాజు ఒక్కరే మూడు ఆటలు అడుతుండడం విశేషం.
రెండు సినిమాలు సొంత ప్రొడక్షన్ లో రాగా మరో సంస్థలో వచ్చిన డాకు మహరాజ్ నైజాం రైట్స్ కూడా తానే తీసుకొని రిలీజ్ చేశారు.
సంక్రాంతి రేసులో బాలకృష్ణ డాకు మహారాజ్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా,
వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” సూపర్ పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది.
అయితే గేమ్ చేంజర్ కి మొదటి రోజు నుండి మంచి ఆక్యుపెన్సీ ఉన్నా, మౌత్ టాక్ ప్రభావంతో స్క్రీన్లలో జనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
మరోవైపు, రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది.
“సంక్రాంతికి వస్తున్నాం”కి డిమాండ్ అమాంతం పెరగడంతో వెంకటేష్ సినిమాకు ప్రేక్షకులు వెనకడుగు వేయడం లేదు.
“సంక్రాంతికి వస్తున్నాం” విడుదలైన ప్రతీ ఏరియాలో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.
మొదటి రెండు రోజుల్లో టికెట్లు దొరకక ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. అలాగే స్క్రీన్ల పరంగా మరింత అన్యాయం జరిగినట్లు అనిపిస్తోంది.
ఈ చిత్రం ఓవర్ ఫ్లో ఆడియెన్స్‌ను ఆకర్షించగా, “గేమ్ చేంజర్” స్క్రీన్లు ఎక్కువగా ఖాళీగా కనిపించాయి.
దిల్ రాజు నిర్మించిన ఈ రెండు చిత్రాల విషయంలో తగిన సమతుల్యత కల్పించడానికి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
“గేమ్ చేంజర్” స్క్రీన్ల సంఖ్య తగ్గించి, వీకెండ్‌లో “సంక్రాంతికి వస్తున్నాం”కి ఎక్కువ స్క్రీన్లు కేటాయించనున్నారు.
ఈ నిర్ణయం వ్యాపార దృక్పథంతో తీసుకున్నప్పటికీ, రామ్ చరణ్ అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి వీకెండ్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక “గేమ్ చేంజర్” పరిమిత స్క్రీన్లలో తన ప్రదర్శనను కొనసాగిస్తే చాలని దిల్ రాజు భావిస్తున్నారు అని ప్రచారం నడుస్తుంది .
వెంకటేష్ చిత్రానికి వచ్చే ఆదాయం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదని ఆయన జడ్జ్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, “సంక్రాంతికి వస్తున్నాం” ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటూ,
సంక్రాంతి సీజన్ విజేతగా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రెండో వీకెండ్ కలెక్షన్ల ద్వారా ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోతుంది.
సంజు పిల్లలమర్రి
Also Read This : పర్‌ఫెక్ట్ నోస్టాలిజిక్ మహేశ్‌బాబు ఫ్యామిలీ ఇమేజెస్….
