హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి,
కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ఎఫ్ఎన్‌సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి,
జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ,
భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్‌సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖరరెడ్డి,
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె.వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్‌సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Also Read This : ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం