అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రాజాసాబ్’ టీజర్ రానే వచ్చింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు మద్దుగుమ్మలు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘‘ఈ ఇల్లు నా దేహం. ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను’’ అంటూ సంజయ్ దత్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. చాలా స్టైలిష్‌గా ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించాడు. విజువల్ వండర్‌లా అనిపిస్తోంది.
ఈ టీజర్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకోగానీ కళ్లను బాగా హైలైట్ చేశారు. చివరకు పురాతన భవనం గేటుకు ఉండే తాళంపై కూడా కన్ను సింబల్ ఉంది. ఈ కన్ను వెనుక ఏం స్టోరీని మారుతి ప్లాన్ చేశారో చూడాలి.
టీజర్ మొత్తంగా ఒక పురాతన భవనాన్ని హైలైట్ చేశారు. దీనిలో రకరకాల కళాత్మక వస్తువులు.. అడుగుకో అద్భుతం కనిపిస్తుంది. దీనిని బట్టి రాజాసాబ్‌కు కళాత్మక వస్తువులంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.
సినిమాలో చూపించిన టీజర్‌లోని పురాతన భవంలోని ఒక గదిలో క్షుద్రపూజల కోసం చేసిన ఏర్పాటు ఉంటుంది. అందులో ఓ అస్థి పంజరం.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ముగ్గు.. దానిలో నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే సన్నివేశాన్ని మన ఊహకే వదిలేశారు. ఇక్కడ కనిపించే మంటలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాలోని అంత:పురం ఒక పోర్టల్.. దానిలోకి పొరపాటున కూడా లోపలికి వెళ్లకూడదు. దీనిలోకి ఒకరు వెళ్లడం రాజాసాబ్ ఆత్మ నిద్రలేవడం వంటి దృశ్యాలు మనకు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
మొత్తానికి టీజర్‌లో ఇలా చాలా ఆసక్తికర అంశాలను చూపించడం జరిగింది. ఇక టీజరే ఇలా ఉంటే.. ట్రైలర్ ఎలా ఉంటుంది? సినిమా ఎలా ఉంటుంది? విజువల్ వండర్ అనడంలో సందేహమే లేదు.
ప్రజావాణి చీదిరాల